ESL Narasimhan: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బాధపడిన వేళ..!

  • నరసింహన్ ఆలయాల చుట్టూ తిరుగుతుంటారని విమర్శలు
  • తనకు దైవభక్తి ఎక్కువని చెప్పిన నరసింహన్
  • తాను ఎక్కువగా వెళ్లింది తిరుమల, యాదాద్రి, భద్రాచలం మాత్రమేనని వివరణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ల పాటు గవర్నర్ గా కొనసాగిన ఈఎస్ఎల్ నరసింహన్ మరికొన్నిరోజుల్లో వీడ్కోలు తీసుకోనున్నారు. ఇటీవలే ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం, కొన్నిరోజుల క్రితం తెలంగాణకు కూడా నూతన గవర్నర్ ను నియమించింది. ఈ నేపథ్యంలో, నరసింహన్ రాజ్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పరమైన అంశాల కంటే, ఇతర అంశాలే తనను ఎక్కువగా బాధించాయని అన్నారు. తనకు దైవభక్తి ఎక్కువని, ఆ కారణంగానే తరచుగా ఆలయాల సందర్శనకు వెళుతుంటానని, కానీ దీనిపై కొందరు విమర్శలు చేయడం చాలా బాధ కలిగించిందని తెలిపారు. అదేపనిగా ఆలయాల చుట్టూ తిరుగుతుంటారని తనపై వ్యాఖ్యలు చేశారని, తన పదవీకాలంలో ఎక్కువగా వెళ్లింది తిరుమల, భద్రాచలం, యాదగిరిగుట్ట ప్రాంతాలకేనని స్పష్టం చేశారు.

ESL Narasimhan
Telangana
Andhra Pradesh
Hyderabad
  • Loading...

More Telugu News