Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల దూషణ.. టీడీపీ నేత కొమ్మినేని శివయ్య అరెస్ట్!

  • తుళ్లూరులోని అనంతవరంలో ఘటన
  • వినాయకుడు మైలపడతాడని దూషించిన టీడీపీ వర్గీయులు
  • పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలింపు ముమ్మరం

వైసీపీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని నలుగురు టీడీపీ నేతలు కులం పేరుతో దూషించిన సంగతి తెలిసిందే. తూళ్లూరు మండలం అనంతవరంలో వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్లిన తనను అడ్డుకున్న టీడీపీ నేతలు, కులం పేరుతో దూషించారనీ, వినాయకుడు మైలపడతాడని వ్యాఖ్యానించారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదుతో టీడీపీ నేతలు కొమ్మినేని శివయ్య, కొమ్మినేని సాయి, కొమ్మినేని రామకృష్ణ, కొమ్మినేని బుజ్జిలపై తుళ్లూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు. అంతేకాకుండా వీరిలో కొమ్మినేని శివయ్యను అరెస్ట్ చేసినట్లు తూళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారనీ, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. తాము ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించినట్లు కొమ్మినేని శివయ్య తమ విచారణలో అంగీకరించాడని పేర్కొన్నారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
MLA
Sridevi undavalli
caste abuse
Police
one arrest
three missing
  • Loading...

More Telugu News