New Delhi: ఢిల్లీలో దోమలపై దండయాత్ర.. సరికొత్త కార్యక్రమం ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్!

  • దస్ హఫ్తే, దస్ బజే దస్ మినిట్ కార్యక్రమం
  • దోమల ఆవాసాలు లేకుండా చేసేందుకు నిర్ణయం
  • కార్యక్రమంలో పాల్గొంటానన్న ఢిల్లీ ఎల్జీ

ఢిల్లీలో డెంగ్యూ, చికున్ గున్యా వంటి విష జ్వరాల నియంత్రణ కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దోమల గుడ్లు పొదిగేందుకు వీలుగా నీరు నిల్వ ఉండకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దస్ హఫ్తే, దస్ బజే దస్ మినిట్(పది వారాలు-పది గంటలకు- పది నిమిషాల పాటు) అంటూ కొత్త కార్యక్రమం తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా ప్రతీ ఇంటిని సందర్శించడంతో పాటు దోమల ద్వారా అంటు వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తొలుత తన ఇంట్లోనే కేజ్రీవాల్ ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను ముఖ్యమంత్రి కోరగా, ఆయన సంతోషంగా అంగీకరించారు.

New Delhi
Chief Minister
Arvind Kejriwal
mosquitos
special mass campaign
10 Hafte-10 Baje-10 Minute
  • Loading...

More Telugu News