Khammam: లండన్ లో అదృశ్యమైన ఖమ్మం బీజేపీ అధ్యక్షుడి కుమారుడి మృతదేహం లభ్యం!

  • ఆగస్టు 21న అదృశ్యం
  • 12 రోజుల తరువాత మృతదేహం లభ్యం
  • కన్నీరు మున్నీరైన ఉదయ్ ప్రతాప్

లండన్ లో అదృశ్యమైన తెలంగాణ యువకుడు శ్రీహర్ష ఉదంతం విషాదాంతం అయింది. ఆయన మృతదేహం లండన్ బీచ్ సమీపంలో ఒడ్డుకు కొట్టుకు రాగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు, మృతదేహాన్ని శ్రీహర్షదిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ కుమారుడే శ్రీహర్ష. తమ కుమారుడి మృతదేహం లభ్యమైందన్న విషయం తెలియగానే, ఆయన ఇంట్లో రోదనలు మిన్నంటాయి. పలువురు బీజేపీ నేతలు ఆయన్ను పరామర్శించేందుకు వచ్చారు. వీలైనంత త్వరగా శ్రీహర్ష మృతదేహాన్ని ఇండియాకు తెప్పించే ఏర్పాట్లు చేస్తామని, రాష్ట్ర నాయకులు ఆయనకు హామీ ఇచ్చారు. విద్యాభ్యాసం నిమిత్తం లండన్ కు వెళ్లిన శ్రీహర్ష, గత నెల 21న సముద్రం వద్దకు వెళ్లి అదృశ్యమైన సంగతి తెలిసిందే.

Khammam
Sri Harsha
Uday Pratap
  • Loading...

More Telugu News