: క్రికెటర్లను సస్పెండ్ చేసిన ఎయిరిండియా


స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు అజిత్ చండిలా, అంకిత్ చవాన్ లను ఎయిరిండియా సస్పెండ్ చేసింది. చండిలా, చవాన్ ఎయిరిండియాలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారు. వీరిద్దరూ పలు కార్పొరేట్ క్రికెట్ టోర్నీల్లో ఎయిరిండియాకు ప్రాతినిధ్యం వహించారు. కాగా, తమ సిబ్బందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో వారిపై తక్షణమే వేటు వేస్తున్నామని ఎయిరిండియా పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా 120 (బి), 420 సెక్షన్ల కింద అరెస్టు అయితే, వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తారు.

  • Loading...

More Telugu News