Commonwealth Games: తల్లిగా ఆనందం మొదలైంది.. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను పోస్టు చేసిన గీతా ఫొగట్

  • 2010లో కామన్‌వెల్త్ పోటీల్లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి  
  • 2016లో రెజ్లర్ పవన్ కుమార్‌ను పెళ్లాడిన గీత
  • తాను గర్భవతినంటూ ఫొటో ట్వీట్

తాను గర్భవతినంటూ రెజ్లర్ గీతా ఫొగట్ ట్వీట్ చేసింది. 30 ఏళ్ల కామన్‌వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ అయిన గీతా ఫొగట్ మరో రెజ్లర్ అయిన పవన్ కుమార్‌ను 2016లో పెళ్లాడింది. ప్రస్తుతం తాను గర్భవతినంటూ సోమవారం బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను ట్వీట్ చేసింది.

‘‘లోపల ఓ ప్రాణి కదలాడుతున్నప్పుడు తల్లిగా ఆనందం మొదలవుతుంది. లోపలి నుంచి చిన్న హృదయ స్పందన మొదటిసారి విన్నప్పుడు, లోపలి నుంచి చిన్ని కదలికలు కనిపించినప్పుడు ఆ చిన్నారి ఒంటరి కాదన్న విషయం అర్థమవుతుంది. లోపల ఒక జీవి పెరిగేంత వరకు జీవితం అంటే ఏమిటో ఎవరికీ అర్థం కాదు’’ అని గీత పేర్కొంది.

Commonwealth Games
wrestler
Geeta Phogat
  • Loading...

More Telugu News