Andhra Pradesh: ఏపీని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో తెలుగువారిని గర్వపడేలా చేసింది!: సీఎం జగన్

  • నేడు వైఎస్సార్ 10వ వర్థంతి
  • నివాళులు అర్పించిన ఏపీ సీఎం
  • వైఎస్ నిర్ణయాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఈరోజు వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. పరిపాలన, ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలుగా నిలిచాయని జగన్ ప్రశంసించారు.

రాష్ట్రాన్ని వైఎస్ నడిపించిన తీరు జాతీయస్థాయిలో తెలుగు ప్రజలను ఎంతో గర్వించేలా చేసిందని వ్యాఖ్యానించారు. నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారని చెప్పారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
ysr
Death annaiversary
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News