Saaho: 'అజ్ఞాతవాసి'పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్రెంచ్ దర్శకుడు ఇప్పుడు 'సాహో'పై విమర్శలు!

  • అజ్ఞాతవాసి తన సినిమా లార్గో వించ్ కు రీమేక్ అంటూ ఆరోపణలు చేసిన జెరోమ్ సల్లే
  • తాజాగా సాహో చిత్రాన్ని టార్గెట్ చేసిన వైనం
  • సాహో కూడా లార్గో వించ్ ప్రేరణగా తెరకెక్కించారని విమర్శలు
  • కాస్త చూసుకుని రీమేక్ లు చేయాలని సలహా

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రాన్ని తాను ఫ్రెంచ్ భాషలో తెరకెక్కించిన లార్గో వించ్ సినిమా చూసి కాపీ కొట్టారని అప్పట్లో  ఫ్రాన్స్ దర్శకుడు జెరోమ్ సల్లే ఆరోపణలు చేయడం తెలిసిందే. అప్పట్లో ఇది వివాదం అయింది. ఇప్పుడదే దర్శకుడు సాహో చిత్రంపై ఆరోపణలకు దిగాడు. సాహో చిత్రాన్ని కూడా లార్గో వించ్ స్ఫూర్తిగా తెరకెక్కించారని, కానీ సాహో తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. సాహో స్టోరీ లైన్ కూడా తన సినిమా కథేనని, కాస్త చూసుకుని రీమేక్ లు చేయాలని జెరోమ్ సల్లే ఉచిత సలహా పారేశాడు.

"చూస్తుంటే ఈ సినిమా నా లార్గో వించ్ కు రెండో ఫ్రీమేక్ లా కనిపిస్తోంది. మొదటి చిత్రంలాగే ఇది కూడా చెత్తగా ఉంది. తెలుగు దర్శకులారా, నా శ్రమను చోరీ చేయాలనుకుంటే కనీసం కాస్త తెలివి ఉపయోగించండి" అంటూ ట్వీట్ చేశాడు.

Saaho
Prabhas
Jerome Salle
  • Error fetching data: Network response was not ok

More Telugu News