IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదం... ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని భాగ్యలక్ష్మి

  • సీలింగ్ కు ఉరివేసుకున్న భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • మృతురాలి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా గోకవరం

కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ కళాశాలలో భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. భాగ్యలక్ష్మి గాళ్స్ హాస్టల్ లోని తన రూంలో సీలింగ్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె చున్నీతో ఉరి వేసుకున్నట్టు గుర్తించారు.

సీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న భాగ్యలక్ష్మి గాళ్స్ హాస్టల్ లోని మూడో అంతస్తులో ఇతర విద్యార్థినులతో ఉంటోంది. ఆమె స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా గోకవరం. అయితే ఆదివారం సాయంత్రం ఎంతకీ కిందికి రాకపోవడంతో తోటి విద్యార్థినులు, సిబ్బంది వచ్చి చూసేసరికి ఆమె ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. అప్పటికే ఆమె మృతి చెందినట్టు గుర్తించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆత్మహత్యకు ముందు భాగ్యలక్ష్మి ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడిందని సహ విద్యార్థినులు చెప్పినట్టు తెలిసింది.

IIIT
Krishna District
  • Loading...

More Telugu News