Adimulapu Suresh: ప్రభుత్వ బడుల్లో చేరాలంటే సిఫారసు లేఖలు అడిగే స్థాయికి తెస్తాం: ఆదిమూలపు సురేశ్

  • నరసరావుపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి
  • విద్యారంగానికి సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని వెల్లడి
  • త్వరలోనే విద్యార్థుల బకాయిలు విడతల వారీగా విడుదల చేస్తామని హామీ

ఏపీలో మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే సిఫారసు లేఖలు అడిగే స్థాయికి తెస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ధీమాగా చెప్పారు. విద్యారంగానికి సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్యా ప్రమాణాలు నెలకొంటాయని అన్నారు. త్వరలోనే విద్యార్థుల బకాయిల మొత్తం విడతల వారీగా విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేటలో జేఎన్టీయూ నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. త్వరలో జేఎన్టీయూ కాలేజ్ కి 80 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని వెల్లడించారు.

Adimulapu Suresh
Jagan
YSRCP
JNTU
Andhra Pradesh
  • Loading...

More Telugu News