: ఆదివారం బీసీసీఐ అత్యవసర సమావేశం
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఐపీఎల్ ను, క్రీడా లోకాన్ని ఒక్క కుదుపు కుదిపేయడంతో బీసీసీఐ ఆదివారం అత్యవసరంగా సమావేశమవుతోంది. ఇందులో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా అరెస్టులపై చర్చించనుంది. అలాగే వీరిపై జీవిత కాల నిషేధం విధించే అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.