Hyderabad: ఏడాదిగా బాలుడిపై లైంగికదాడి...పాఠశాలలో వెలుగుచూసిన అకృత్యం

  • బాలుడి తండ్రి ఫిర్యాదుతో బట్టబయలు
  • ముగ్గురు నిందితులపై కేసు నమోదు
  • అంతా టెన్త్‌ విద్యార్థులే

బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ సాగిపోవాల్సిన వయసులో వికృతమైన చేష్టలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన ముగ్గురు టెన్త్‌ విద్యార్థుల దురాగతం ఇది. తోటి విద్యార్థిపై ఏడాది నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు వెలుగు చూడడంతో విన్నవారంతా అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌ భవానీనగర్‌ ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న ఓ బాలుడు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు సదరు విద్యార్థితో ఏడాది నుంచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం ఎవరితో చెప్పవద్దని బెదిరించేవారు.

ఇటీవల బాధిత విద్యార్థి తండ్రి పాఠశాలకు రాగా కొడుకు నీరసంగా ఉండడం గమనించాడు. విషయం ఏమిటని అతను ఆరాతీయగా ముగ్గురు విద్యార్థులు ఏడాదికాలంగా తనపై లైంగిక దాడి చేస్తున్న విషయాన్ని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోయిన తండ్రి వెంటనే చాంద్రాయణగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశాడు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
sexual herasment
tenth students
  • Loading...

More Telugu News