shane warne: సెక్స్ వర్కర్లతో దిగ్గజ స్పిన్నర్ వార్న్ రాసలీలలు.. తలుపు తెరిచే ఉంచడంతో ఇబ్బంది పడిన పక్కింటివారు!
- లవర్, ఇద్దరు సెక్స్ వర్కర్లను ఇంటికి పిలిపించుకున్న వార్న్
- పార్టీ పేరుతో హల్‌చల్
- పొరుగింటి వారికి నిద్రను దూరం చేసిన వార్న్
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. తన ప్రేమికురాలితోపాటు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లను ఏకంగా ఇంటికే పిలిపించుకుని రాసలీలల్లో మునిగిపోయాడు. తలుపులు బార్ల తెరుచుకుని మరీ నానా హంగామా చేసి ఇరుగుపొరుగుకు ఇబ్బంది కలిగించాడు. మంగళవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సన్ పత్రిక కథనం ప్రకారం.. ఈస్ట్ లండన్‌లో ఉన్న తన ఇంటికి వార్న్ తన లవర్‌తోపాటు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లు డవీనా (19), పాపీ (27)లను పిలిపించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో తలుపులు తెరిచే ఉంచడంతో లోపల జరుగుతున్న తతంగం మొత్తం పక్కింటి వారి కళ్లకు కట్టింది. చెవులు చిల్లులు పడే మ్యూజిక్‌తోపాటు పార్టీ సందర్భంగా చేసిన గ్లాసుల గలగలలతో ఇరుగు పొరుగుకు నిద్ర కరవైంది. అనంతరం యువతులు ముగ్గురూ వెళ్లిపోయారు. ఆ తర్వాతి రోజు వార్న్ చెప్పులు లేకుండానే కారులో వెళ్లిన ఫొటోలు బయటకు వచ్చాయి.
వార్న్ తీరుపై పొరిగింటి వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చర్యల వల్ల ఇరుగు పొరుగు ఇబ్బంది పడతారన్న కనీస జ్ఞానం కూడా వార్న్‌కు లేకపోయిందని మండిపడ్డారు. వార్న్ ఇంటి పక్కన గౌరవ ప్రదమైన కుటుంబాలు ఉన్నాయని, కనీసం కిటికీ తలుపులు కూడా వేసుకోకుండా పార్టీలంటూ హడావిడి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.