siddaramaiah: మాజీ సీఎం సిద్దరామయ్య కోడలి బార్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసుల దాడి
- షుగర్ ఫ్యాక్టర్ బార్ అండర్ రెస్టారెంట్‌పై పోలీసుల దాడి
- సమయ పాలన లేకుండా నడుస్తున్న బార్, డెస్కోథెక్
- తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మత్తులో 300 మంది
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోడలు స్వాతి నిర్వహిస్తున్న షుగర్ ఫ్యాక్టరీ బార్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసులు దాడి చేశారు. లీ మెరిడియన్ స్టార్ హోటల్‌కు అనుబంధంగా ఉన్న ఈ బార్‌తోపాటు డిస్కోథెక్పై శుక్రవారం రాత్రి దాడి చేసిన పోలీసులు బార్ మేనేజర్ విద్యారణ్యపుర మంజునాథ్ అలియాస్ మోహన్‌గౌడ, శేషాద్రిపురానికి చెందిన డీజే నవీన్, క్యాషియర్ శశికుమార్ (41)లను అరెస్టు చేశారు.
లీమెరిడియన్ యజమాని అయిన మెక్చార్లెస్.. సంతోశ్‌రెడ్డితో కలిసి బార్ అండ్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే, బార్ అండ్ రెస్టారెంట్‌ను సమయపాలన లేకుండా నిర్వహించడం, తెల్లవారుజామున మూడు గంటల వరకు డిస్కోథెక్లను కొనసాగించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. బార్‌పై దాడిచేసిన సమయంలో దాదాపు 300 మంది మద్యం మత్తులో తూగుతున్నట్టు జేసీ పేర్కొన్నారు. దాడి సందర్భంగా సౌండ్ సిస్టం, మ్యూజిక్ కంట్రోలర్, మద్యం బాటిళ్లు, స్వైపింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.