Hanuma Vihari: రెండో టెస్టు: సెంచరీ ముంగిట నిలిచిన హనుమ విహారి

  • లోయర్ ఆర్డర్ అండతో బ్యాటింగ్ కొనసాగిస్తున్న విహారి
  • కోహ్లీ అర్ధ సెంచరీ
  • 4 వికెట్లు తీసిన విండీస్ కెప్టెన్

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు హనుమ విహారి సెంచరీ దిశగా సాగుతున్నాడు. విహారి తొలి సెషన్ చివరికి 84 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. విహారికి తోడుగా ఇషాంత్ శర్మ 11 పరుగులతో ఆడుతున్నాడు. రెండో రోజు ఆట ప్రారంభంచిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 118 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.  అంతకుముందు ఆటలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక పంత్ కూడా రెండో రోజు ఆటలో ప్రారంభంలోనే పెవిలియన్ చేరాడు. అయితే, విహారి లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అండతో ఇన్నింగ్స్ నడిపిస్తున్నాడు.

Hanuma Vihari
India
West Indies
Cricket
  • Loading...

More Telugu News