Arvind Kejriwal: కేజ్రీవాల్ తో పోటీకి దిగేది ఎవరు?... బీజేపీకి సవాల్ విసిరిన ఆమ్ ఆద్మీ పార్టీ

  • బీజేపీ నేత విజయ్ గోయల్ కు లేఖ రాసిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
  • కాషాయదళానికి మూడు ప్రశ్నలు సంధించిన ఆమ్ ఆద్మీ నేత
  • 24 గంటల్లోగా ప్రజలకు సమాధానం చెప్పాలంటూ గడువు

ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఉరకలేస్తోంది. ఈ క్రమంలో బీజేపీకి సవాల్ విసిరింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పోటీకి దిగే బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అంటూ ప్రశ్నించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బీజేపీ నేత విజయ్ గోయల్ కు రాసిన లేఖలో మూడు ప్రశ్నలు అడిగారు.

వాటిలో, కేజ్రీవాల్ పై పోటీకి దిగే బీజేపీ ప్రత్యర్థి ఎవరన్నది ఓ ప్రశ్న. ఢిల్లీ ప్రజలకు బీజేపీ 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా ఇవ్వగలదా? ప్రజల నీటి బకాయిల మాఫీకి బీజేపీ అనుకూలమా? అంటూ మరో రెండు ప్రశ్నలు అడిగారు. తాను అడిగిన ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలు ప్రజలకు సమాధానం ఇవ్వాలంటూ సంజయ్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. అందుకు 24 గంటలు గడువు విధించారు.

Arvind Kejriwal
AAP
Sanjay Singh
  • Loading...

More Telugu News