Jagan: 70వ వన మహోత్సవాన్ని ప్రారంభించిన జగన్

  • గుంటూరు జిల్లా డోకిపర్రు గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్
  • విద్యార్థులతో కలసి మొక్కలు నాటిన సీఎం
  • 25 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం

పర్యావరణాన్ని పరిరక్షించే నిమిత్తం అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 70వ వన మహోత్సవాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు వనమహోత్సవ కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • Loading...

More Telugu News