Handrineeva: ‘హంద్రీనీవా’ సామర్థ్యం పెంచాలని సీఎం జగన్ కు పయ్యావుల వినతి

  • ఏపీలో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత
  • ప్రాధాన్యతా ప్రాజెక్టుల జాబితాలో ‘హంద్రీనీవా’
  • ‘హంద్రీనీవా’ పేరు ఉంచడం అభినందనీయమన్న కేశవ్

ఏపీలో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. మొత్తం 14 ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పద్నాలుగు ప్రాజెక్టుల్లో ‘హంద్రీనీవా’ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ‘హంద్రీనీవా’ పేరు ఉంచడం అభినందనీయమని ప్రశంసిస్తూ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని కోరారు. ఈ కాలువ వెడల్పు పనులను గత ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిందని, మిగిలిన 30 శాతం పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News