Chandrababu: చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను పవన్ బయటపెట్టాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనపై ఆర్కే విమర్శలు
  • పర్యటనల ద్వారా వాస్తవాలు బయటపెట్టాలి
  • చంద్రబాబుని నమ్మి పొలాలు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అక్కడి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, ఎవరైనా సరే, వాస్తవాలను వెలికితీయడానికే వారి పర్యటనలను ఉపయోగించుకోవాలని, ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కు సూటిగా చెబుతున్నానని అన్నారు.

చంద్రబాబునాయుడిని నమ్మి పొలాలు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదని విమర్శించారు. అప్పట్లో మంగళగిరి రూరల్ మండలం బేతపూడిలో అక్రమాలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారని, గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను పవన్ బయటపెట్టాలని సూచించారు. రైతుల భూములను చంద్రబాబు బలవంతంగా తీసుకోవాలని చూస్తే, తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని నాడు ప్రకటించిన పవన్, ఆ తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Chandrababu
Pawan Kalyan
Alla Ramakrishna
  • Loading...

More Telugu News