Khammam District: రేణుకా చౌదరిపై మోసం కేసు.. నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీచేసిన కోర్టు

  • ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్‌క్లాస్‌ కోర్టు జారీ
  • టికెట్‌ పేరుతో తన భర్తను మోసగించినట్టు కళావతి అనే మహిళ ఫిర్యాదు
  • విచారణకు హాజరు కాకపోవడంతో వారెంటు

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకాచౌదరికి నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ అయింది. ఆమెపై నమోదైన మోసం కేసు విషయంలో నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్‌క్లాస్‌ కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు వారెంటు ఇష్యూ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తన భర్తకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానంటూ రేణుక తమను మోసగించిందని కళావతి అనే మహిళ న్యాయ స్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ స్వీకరించిన కోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా రేణుకకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు తీసుకోక పోవడం, విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తాజా నోటీసులను జారీ చేసింది.

Khammam District
renukachowdary
nonbailble warent
cheating case
  • Loading...

More Telugu News