stones in stomoch: మహిళ పొట్టలో రాళ్ల కుప్ప.. ఆపరేషన్‌ చేసి తీసిన వైద్యులు

  • చిన్నవి, పెద్దవి కలిపి 1500 పైమాటే
  • లూథియానా ప్రజా వైద్యశాలలో శస్త్రచికిత్స
  • ల్యాప్రోస్కోపీ విధానంలో తొలగింపు

మహిళ పొట్టలో ఏకంగా రాళ్ల కుప్పే ఉండడం వైద్యులనే ఆశ్చర్యపరిచింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1500 రాళ్లున్నాయి. కొన్ని పెద్దవి, మరికొన్ని చాలా చిన్నవి. పంజాబ్‌ రాష్ట్రం లూథియానా ప్రజా వైద్యశాలలో డాక్టర్లు ప్రత్యేక శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు. వివరాల్లోకి వెళితే మణిపూర్‌కు చెందిన ప్రేమలత గడచిన మూడేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఎంత మంది వైద్యుల వద్దకు వెళ్లినా ఆమెకు ఉపశమనం మాత్రం లభించ లేదు. చివరికి లూథియానాకు చెందిన డాక్టర్‌ మిల్నే వర్మ గురించి తెలియడంతో ఆయనను సంప్రదించింది. ఆయన పలు పరీక్షల అనంతరం పొట్టలో పెద్దమొత్తంలో రాళ్లున్నాయని గుర్తించారు.

శస్త్ర చికిత్స చేసి తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఏర్పాట్లు చేశారు. అయితే చాలా రాళ్లు తక్కువ పరిమాణంతో ఉండడంతో ల్యాప్రోస్కోపీ విధానం అనుసరించి ఆపరేషన్‌ చేశారు. కాగా, ప్రేమలత పొట్టలో పెద్ద రాళ్లకుప్పే ఉండడం వైద్య సిబ్బందినే ఆశ్చర్య పరిచింది. శస్త్రచికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది.

stones in stomoch
punjab
ludhiyana
operation
  • Loading...

More Telugu News