Women Constable: మహిళా కానిస్టేబుల్ కు బలవంతంగా తాళి కట్టిన యువకుడు

  • మంచిర్యాల కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న బాధితురాలు
  • వరుసకు బావ అయ్యే యువకుడు తాళి కట్టిన వైనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఓ మహిళా కానిస్టేబుల్ కు వరుసకు బావ అయిన ఓ యువకుడు బలవంతంగా తాళి కట్టిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళా కానిస్టేబుల్ విధులను నిర్వహిస్తున్నారు. జగిత్యాలకు చెందిన చింతల కుమారస్వామి అనే యువకుడికి సదరు మహిళా కానిస్టేబుల్ వరుసకు మరదలు అవుతుంది. నిన్న విధుల్లో ఉన్న ఆమె వద్దకు చేరుకున్న కుమారస్వామి... ఆమెకు బలవంతంగా తాళి కట్టాడు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుపుతున్నామని ఈ సందర్భంగా ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు.

Women Constable
Marriage
Mancherial
  • Loading...

More Telugu News