Nellore District: ఆసియాలోనే అతిపెద్ద థియేటర్ ను ప్రారంభించిన హీరో రామ్ చరణ్

  • సూళ్లూరుపేటకు సమీపంలోని పిండిపాళెంలో ఎపిక్ స్క్రీన్ థియేటర్ ప్రారంభం
  • ‘సాహో’, ‘సైరా’ల విజువల్స్ ను చూసిన రామ్ చరణ్
  • 100 అడుగుల వెడల్పు, 80 అడుగుల ఎత్తులో స్క్రీన్

ప్రపంచంలో మూడవ అతిపెద్దది, ఆసియాలో అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ ను టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఈరోజు ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట పట్టణానికి సమీపంలోని పిండిపాళెంలో క్యూబ్ సినిమా సంస్థకు చెందిన ఎపిక్ స్క్రీన్ థియేటర్ ను రామ్ చరణ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేపు విడుదల కానున్న ‘సాహో’, త్వరలో రిలీజ్ కానున్న ‘సైరా’ చిత్రాల విజువల్స్ ను ఈ స్క్రీన్ పై రామ్ చరణ్ వీక్షించాడు. గ్రాండ్ విజువల్స్ ను ఎపిక్ స్క్రీన్ పై చూడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ‘సైరా’ను ఈ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.

ఇక, ఎపిక్ స్క్రీన్ గురించి చెప్పాలంటే.. 100 అడుగుల వెడల్పు, 80 అడుగుల ఎత్తులో ఉంది. హై ఎండ్ లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ ఆడియో వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 

Nellore District
Sullurupet
Epiq Theatre
Ram charan
  • Loading...

More Telugu News