Rajinikanth: రాష్ట్రాన్ని తమిళుడే పాలించాలి.. రజనీకాంత్‌ను అడ్డుకుంటాం: హెచ్చరించిన సీమాన్

  • తమిళనాడును రాష్ట్రేతరులు పాలించడాన్ని అంగీకరించబోం
  • రజనీకాంత్ రాజకీయ పార్టీని అడ్డుకుంటాం
  • మేం ఓడిపోలేదు.. ప్రజలే ఓడిపోయారు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు స్థానికేతర సెగ తగులుతోంది. తమిళనాడును తమిళుడే పాలించాలని, రాష్ట్రేతరులు పాలించడాన్ని తాము అడ్డుకుంటామని నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌ హెచ్చరించారు. రజనీకాంత్ కనుక రాజకీయ పార్టీని ప్రకటిస్తే దానిని అడ్డుకుని తీరుతామన్నారు.

కాంచీపురంలో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీమాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలను దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలు కావడంపై సీమాన్ మాట్లాడుతూ.. తాను ఓడిపోలేదని, ప్రజలే ఓడిపోయారని అన్నారు. తాను చదువుకోకపోయినా ఇతరుల చదువు కోసం శ్రమించిన కామరాజర్ వంటి నాయకులు ఇప్పుడు లేరని సీమాన్ అన్నారు.

Rajinikanth
seeman
Tamil Nadu
  • Loading...

More Telugu News