: ఆర్థిక నిరంకుశత్వం వీడండి: ప్రపంచనేతలకు పోప్ పిలుపు
హృదయం లేని ఆర్థిక నియంతృత్వ పాలన అంతమవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక రంగాన సంస్కరణలు అవసరమని సూచించారు. ఆర్థిక సంక్షోభం, పేద, ధనిక దేశాలలో కోట్లాది మంది జీవితాలను దారుణంగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది జీవితాలలో ఆనందం లేకుండా చేసిందని, హింస, పేదరికం పెరగడానికి కారణమైందన్నారు. ధనం సేవలందించాలే కానీ, పాలించకూడదన్నారు. ఈ మేరకు పోప్ ఆర్థిక విషయాలపై తన తొలి ప్రసంగాన్ని వాటికన్ లో వినిపించారు. తగిన దిద్దుబాటు చర్యలతో తమ ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు.