Rajini Vidadala: చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనిపై అసభ్య పోస్టులు... ఇద్దరి అరెస్టు

  • వాట్సాప్, ఫేస్ బుక్ లలో పోస్టులు
  • కోటేశ్వరరావు, బాలాజీసింగ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వార్నింగ్

గుంటూరు జిల్లా చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజనిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. వైసీపీ ఎమ్మెల్యే రజనిపై అభ్యంతరకరమైన రీతిలో ఫేస్ బుక్, వాట్సాప్ లలో పోస్టులు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలాజీసింగ్, పి.కోటేశ్వరరావు అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు పట్టణ సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Rajini Vidadala
Chilakaluripeta
YSRCP
  • Loading...

More Telugu News