Badminton: పీవీ సింధు, మానసి జోషిని సన్మానించిన గవర్నర్ నరసింహన్

  • రాజ్ భవన్ లోని దర్బార్ లో సన్మాన కార్యక్రమం 
  • పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచారు
  • పారా షట్లర్ మానసి, ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక: గవర్నర్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన సందర్భంగా ప్రముఖ షట్లర్ పీవీ సింధును తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు సన్మానించారు. హైదరాబాద్, రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్, సింధు కుటుంబసభ్యులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. పారా షట్లర్ మానసి జోషిని కూడా గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. వచ్చే ఒలింపిక్ క్రీడల్లో సింధు కచ్చితంగా స్వర్ణం సాధిస్తారని ఆకాంక్షించారు. పారా షట్లర్ మానసి, ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక అని, ఎంతో మందికి ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

Badminton
PV Sindhu
para shuttler
Governer
  • Loading...

More Telugu News