Manasi Joshi: పీవీ సింధు కంటే ఒక రోజు ముందే మానసి ప్రపంచ ఛాంపియన్ అయింది.. ఈ విషయం మనలో ఎందరికి తెలుసు?

  • ఆదివారం ప్రపంచ ఛాంపియన్ అయిన పీవీ సింధు
  • శనివారమే గోల్డ్ మెడల్ సాధించిన మానసి జోషి
  • ప్యారా బ్యాడ్మింటన్ లో వరల్డ్ ఛాంపియన్ మానసి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించి పీవీ సింధును... ఆ ఘనతను సాధించిన తొలి భారత మహిళగా అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. సామాన్యుడి దగ్గర నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు ఆమెపై ప్రశంసలు జల్లులు కురిపించారు. అయితే, మనలో ఎంతో మంది మరో భారతీయ మహిళ సాధించిన ఘనతను గుర్తించలేకపోయారు. ఆమెకు ఎవరి నుంచీ ప్రశంసలు కూడా దక్కలేదు. ఇది నమ్మకపోయినా నిజం.

మానసి జోషి... ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ ఈమే. పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించిన రోజు (ఆదివారం) కంటే ఒక రోజు ముందే (శనివారం) ఈమె బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే... ప్యారా బ్యాండ్మింటన్ విభాగంలో ఆమె ఈ ఘనతను సాధించింది. ఒక కాలు కోల్పోయిన మానసి... కృత్రిమ కాలుతోనే, మొక్కవోని పట్టుదలతో శ్రమించి, బంగారు పతకాన్ని సాధించి... త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. బాధ పడాల్సిన విషయం ఏమింటంలే... ప్యారా బ్యాడ్మింటన్ విభాగంలో ఆమె ఆడుతుండటంతో... ఆమెను ఎవరూ పట్టించుకోలేకపోయారు. ఇప్పటికైనా మానసి సాధించిన ఘనతను అందరూ గుర్తించి, ఆమెను సమున్నత రీతిలో గౌరవించాల్సిన అవసరం ఉంది.

  • Loading...

More Telugu News