Vidya Balan: ఓ దర్శకుడు నన్ను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు:విద్యాబాలన్‌

  • సినీ రంగంలో మహిళలపై లైంగిక వేధింపులు నిజమే
  • కెరీర్ ఆరంభంలో నేను కూడా చేదు అనుభవాలను ఎదుర్కొన్నా
  • నీది హీరోయిన్ ముఖమేనా అని ఓ నిర్మాత కించపరిచాడు

తన సినీ ప్రయాణంలో చోటుచేసుకున్న ఓ దారుణ అనుభవాన్ని బాలీవుడ్ నటి విద్యాబాలన్ వెల్లడించారు. సినీ రంగంలో మహిళలపై లైంగిక వేధింపులు నిజమేనని... తన కెరీర్ ఆరంభంలో కూడా తాను చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపారు. తాను చెన్నైలో ఉన్నప్పుడు ఓ దర్శకుడు తనను కలవడానికి వచ్చాడని... మీతో మాట్లాడాలి, రూమ్ లోకి వెళ్దామని కోరాడని అన్నారు. కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుకుందామంటే అతను వినలేదని.. రూమ్ లోకి వెళ్లిన తర్వాత డోర్ వేసి, అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. తనకు ఎంతో కోపం వచ్చిందని, తలుపు తీసి వెళ్లిపొమ్మన్నట్టు అతని వైపు చూశానని... దీంతో, అతను రూమ్ నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.

ఓ సినీ నిర్మాత తనను చూసి హీరోయిన్ ముఖమేనా అని కించపరిచాడని విద్యాబాలన్ తెలిపారు. ఆ తర్వాత తనను తాను నిరూపించుకుని, అగ్రనటి స్థాయికి ఎదిగానని చెప్పారు. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్నానని అన్నారు.

Vidya Balan
Bollywood
Sexual Harrassment
  • Loading...

More Telugu News