Rahul Gandhi: పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ

  • కశ్మీర్ లో హింసకు పాకిస్థానే కారణం
  • ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టులకు పాక్ మద్దతిస్తోంది
  • కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారం 

దాయాది దేశం పాకిస్థాన్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్మూ కశ్మీర్ లో హింస ఉందనే విషయం నిజమేనని... అయితే, దీనికి పాకిస్థానే కారణమని అన్నారు. కశ్మీర్ లో హింస చోటు చేసుకునేలా పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని చెప్పారు. ఒక్క కశ్మీర్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టులకు పాక్ మద్దతు ఇస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నో విషయాలలో ప్రభుత్వంతో తాను ఏకీభవించలేనని, అయితే ఒక్క విషయాన్ని మాత్రం తాను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని అన్నారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్ కే కాదు, మరే దేశానికి తావులేదని చెప్పారు.

Rahul Gandhi
Jammu And Kashmir
Terrorism
Violence
Pakistan
  • Loading...

More Telugu News