Kodela: రూ. 70 లక్షల డైనింగ్ టేబుల్ నుంచి... కోడెల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న ఫర్నీచర్ వివరాలు!
- హైదరాబాద్ అసెంబ్లీ ఫర్నీచర్ కోడెల సొంతానికి వినియోగం
- మొత్తం ఫర్నీచర్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు
- డైనింగ్ టేబుల్ నుంచి ప్లాస్టిక్ కుర్చీల వరకూ షోరూమ్ లో గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, హైదరాబాద్ లోని అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ ను తన సొంతానికి వినియోగించుకోగా, వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కోడెల కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న ఓ షోరూమ్ లో ఈ ఫర్నీచర్ ను గుర్తించిన అధికారులు విస్తుపోయారు. రూ. 70 లక్షల విలువైన డైనింగ్ టేబుల్ నుంచి, ప్లాస్టిక్ కుర్చీల వరకూ అక్కడ చూశారు. మొత్తం ఫర్నీచర్ ను స్వాధీనం చేసుకుని అమరావతి తరలించారు.
ఇక ఈ షోరూమ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫర్నీచర్ లో వైట్ ప్లాస్టిక్ కుర్చీలు 27, బ్రౌన్ ప్లాస్టిక్ కుర్చీలు 9, పికాక్ చైర్లు 14, డైనింగ్ టేబుల్ గ్లాస్ 1, త్రీ సీటర్ ఐరన్ చైర్ల సెట్లు 3, త్రీ సీటర్ సోఫా సెట్లు 3 ఉన్నాయి. వీటితో పాటు కంప్యూటర్ టేబుల్ 1, బీఏసీ టేబుల్ టాప్ 1, ఉడెన్ కప్ బోర్డులు 2, గ్రీన్ చైర్లు 22, టేబుల్స్ విత్ సైడ్ ర్యాక్స్ 7, టీపాయ్ 1, డైనింగ్ టేబుల్ 1 తదితరాలు ఉన్నాయి.