Madhya Pradesh: ఆ ఎంపీల కాళ్లను ఆమె ముద్దుపెట్టుకునేది.. కలెక్టర్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • కలకలం రేపుతున్న మధ్యప్రదేశ్ ఎంపీ కేపీ యాదవ్ వ్యాఖ్యలు
  • ఆమె ఊరూరు తిరిగి ఎంపీ కాళ్లను ముద్దు పెట్టుకుంది
  • రైతుల సమస్యను పరిష్కరించకుంటే ఇక్కడే బైఠాయిస్తా

ఓ మహిళా కలెక్టర్‌పై మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ కేపీ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆమె భట్రాజులా తయారయ్యారని, ప్రతీ గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజాప్రతినిధుల కాళ్లను ముద్దాడేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అశోక్‌నగర్ జిల్లా కలెక్టర్‌పై ఆయనీ వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. జిల్లాలోని రైతుల దురవస్థపై నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఎంపీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఆమె గతంలో అన్ని గ్రామాలు సందర్శించేది. ఎంపీలను కలిసి వాళ్ల కాళ్లను ముద్దాడేది. ఈ రోజు ఒక ఎంపీ స్వయంగా వచ్చి మాట్లాడుతున్నారు. ఆమె వచ్చి సమస్యను పరిష్కరించకుంటే నేనిక్కడే బైఠాయిస్తా’’ అని యాదవ్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాపై యాదవ్ విజయం సాధించారు. కాగా, కలెక్టర్‌పై ఆయన చేసిన దారుణ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Madhya Pradesh
woman collector
kiss
BJP
  • Loading...

More Telugu News