Canara Banl: కెనరా బ్యాంకు ఏటీఎం నగదు లావాదేవీలకు ఇకపై ఓటీపీ తప్పనిసరి!

  • రూ.10 వేలు, ఆపై మొత్తాల విత్ డ్రాలకు కొత్త నిబంధన ప్రవేశపెట్టిన కెనరా బ్యాంకు
  • రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే నగదు
  • అక్రమాల నిరోధానికి ఓటీపీ విధానం మేలు చేస్తుందంటున్న కెనరా బ్యాంకు వర్గాలు

కెనరా బ్యాంకు తన ఏటీఎం నగదు లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇకమీదట, కెనరా బ్యాంకు ఏటీఎంల నుంచి రూ,10,000, ఆపై మొత్తాలను విత్ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. వినియోగదారుడి ఖాతాతో అనుసంధానమైన ఫోన్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే నగదు బయటికి వస్తుంది. భారీ మొత్తాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసే సమయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఈ ఓటీపీ విధానం నిరోధిస్తుందని కెనరా బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.

Canara Banl
ATM
OTP
  • Loading...

More Telugu News