Bobby Simha: సినిమాల్లో ఛాన్సుల కోసం డబ్బులిచ్చి మోసపోయాను: నటుడు బాబీ సింహా

  • నా అసలు పేరు 'జయసింహా'
  • సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడ్డాను 
  • మోసం చేయడమే కొంతమంది జీవనాధారం

తమిళంలో హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బాబీసింహా, తెలుగు ప్రేక్షకులకు చేరువకావాలనే ప్రయత్నాలను ప్రారంభించాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన తెలుగు సినిమాలను కూడా చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నా అసలు పేరు 'జయసింహా' .. ఇంట్లో వాళ్లంతా 'బాబీ' అనే ముద్దుపేరుతో పిలిచేవాళ్లు. కాలేజ్ లో స్నేహితులంతా 'సింహా' అని పిలిచేవాళ్లు.

ఆ తరువాత ఈ రెండింటిని కలిపి 'బాబీ సింహా' అని పిలవడం మొదలైపోయింది. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసేవాళ్లలో చాలామంది ఎదురు డబ్బులిచ్చి మోసపోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. నా విషయంలోనూ అలాగే జరిగింది. వేషాలు ఇస్తామని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేసిన వాళ్లు వున్నారు. ఆ పరిస్థితుల్లో అలాంటివాళ్లను నమ్మాలనిపిస్తుందంతే. మోసం చేయడం వాళ్ల జీవనాధారం అని సరిపెట్టుకున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Bobby Simha
  • Error fetching data: Network response was not ok

More Telugu News