Anantha Sriram: 'బాహుబలి'లో ఆ పాట రాయడానికి 73 రోజులు పట్టింది: సినీ గేయరచయిత అనంత శ్రీరామ్

  • 'పచ్చబొట్టేసిన' పాట బాగా పాప్యులర్ అయింది 
  • పాత్రల్లో వైవిధ్యం .. నేపథ్యం ఇబ్బంది పెట్టాయి 
  • ఆలోచనలతోనే 20 రోజులు గడిచిపోయాయి

'బాహుబలి' సినిమాలో 'పచ్చబొట్టేసిన' పాట ఎంతగానో పాప్యులర్ అయింది. ఆ పాటను అనంత శ్రీరామ్ రాశాడు. ఆ పాటను గురించి ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించాడు. 'బాహుబలి' సినిమా కోసం ఈ పాట రాయమని కీరవాణి గారు చెప్పారు. కథా పరంగా చూసుకుంటే ప్రభాస్ పాత్ర .. ఆయన నేపథ్యం వేరు .. ఆయన ఉపయోగించే భాష వేరు.

తమన్నా పెరిగిన నేపథ్యం .. ఆమె భాష  .. వున్న పరిస్థితులు వేరు. పాట పరంగా వీళ్లిద్దరినీ కలపాలంటే ఏ పదాలను ఎంచుకోవాలి అనే ఆలోచన మొదలైంది. పూర్తిగా గ్రామ్యం గానీ .. గ్రాంధికంగాని ఎంచుకునే అవకాశం లేదు. ఈ రెండు పాత్రల మధ్య భావాల పరంగా ఒక సమతుల్యత ఎలా తీసుకురావాలనే ఆలోచనతోనే 20 రోజులు గడిచిపోయాయి. పాట తరువాత జరిగే సన్నివేశాల తాలూకు భావాలు కూడా ఈ పాత్రల్లో కనిపించాలి. వీటన్నింటిని సమన్వయం చేసుకుంటూ ఈ పాటను రాయడానికి నాకు 73 రోజులు పట్టింది" అని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.

Anantha Sriram
Ali
  • Loading...

More Telugu News