amaravathi: రాజధాని రైతుల నిరసనాగ్రహం...రోడ్డెక్కిన ఎర్రబాలెం వాసులు
- రోడ్డుపై బైఠాయించి ఆందోళన
- మంత్రుల ప్రకటనలతో ఊపందుకుంటున్న ఉద్యమం
- ఒక్కో గ్రామం నుంచి పెల్లుబుకుతున్న నిరసన
రాజధానిని అమరావతి నుంచి మార్చే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. రోజుకో గ్రామం రైతులు నిరసన గళంతో గొంతు కలుపుతుండడంతో ఉద్యమం ఊపందుకుంటోంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ గళం వినిపిస్తున్నారు.
తాజాగా ఈరోజు ఉదయం మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. కొండవీటి వాగు ఎప్పుడూ పొంగింది లేదు, రాజధాని మునిగింది లేదని, అందువల్ల ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయకుండా రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.