Ileana: ప్రియుడి నుంచి విడిపోయిన ఇలియానా?

  • ఆండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియన్ ను ప్రేమించిన ఇలియానా
  • సోషల్ మీడియాను షేక్ చేసిన ఇద్దరి ఫొటోలు
  • ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసిన ప్రేమికులు

ఆండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ప్రేమలో సినీ నటి ఇలియానా మునిగి తేలిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి దిగిన ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే, వీరి ప్రేమ వ్యవహారం అటకెక్కిందనే వార్తలు ఇప్పుడు షికారు చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో కావడమే దీనికి కారణం. అంతేకాదు, ఇద్దరూ కలసి ఉన్న ఫొటోలను కూడా ఆండ్రూ డిలీట్ చేశాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని... అందుకే విడిపోయారని బీటౌన్ లో అనుకుంటున్నారు.

2017లో తన క్రిస్మస్ పోస్ట్ లో అండ్రూ నీబోన్ ను తన కాబోయే భర్త అంటూ ఇలియానా వెల్లడించింది. అంతకు మించి తమ రిలేషన్ షిప్ గురించి ఆమె ఎక్కడా మాట్లాడలేదు. ఒక విదేశీయుడితో తాను డేటింగ్ చేస్తున్నానని గత ఏడాది ఆమె ప్రకటించింది. జులై 19న తన ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇంతలోనే ఏం జరిగిందో కానీ... ఇద్దరూ ఒకరికొకరు దూరమయ్యారు.

Ileana
Andrew Kneebone
Breakup
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News