RBI: కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్లను బదిలీ చేయనున్న ఆర్బీఐ

  • కేంద్రానికి బదిలీ కానున్న రూ. 1,76,051 కోట్లు
  • ఆమోదముద్ర వేసిన ఆర్బీఐ బోర్డు
  • త్వరలోనే నిధుల బదిలీ

రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు బదిలీ కానున్నాయి. కేంద్రానికి నిధులను బదిలీ చేసేందుకు ఆర్బీఐ సమ్మతి తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో నిధుల బదిలీకి ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో, త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,76,051 కోట్లు బదిలీ కానున్నాయి. నిధుల బదిలీ ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ... గత ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ నిధుల బదలాయింపుకు ఒప్పుకోలేదు. దీంతో, ఆయనను రాజీనామా చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

RBI
Union Government
Funds
  • Loading...

More Telugu News