Meera Chopra: స్టార్ హోటల్ ఫుడ్ లో పురుగులు... వీడియో షేర్ చేసిన హీరోయిన్!

  • తెలుగులోనూ నటించిన మీరా చోప్రా
  • అహ్మదాబాద్ హోటల్ కు వెళ్లిన వేళ ఘటన
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హీరోయిన్

పవన్ కల్యాణ్ తో 'బంగారం'తో పాటు 'వాన' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైన మీరా చోప్రా, తాజాగా, తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. అల్పాహారం తీసుకునేందుకు తాను ఓ స్టార్ హోటల్ కు వెళ్లగా, చేదు అనుభవం ఎదురైందని, తనకు తెచ్చిచ్చిన ఆహారంలో పురుగులు వచ్చాయని ఆమె ఆరోపించింది. అహ్మదాబాద్ లోని డబుల్ ట్రీ అనే హోటల్ లో ఈ ఘటన జరిగిందని వెల్లడించిన ఆమె, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని కూడా తనకు పురుగులున్న ఆహారాన్ని పెట్టారని, ఆహార భద్రతా అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మీరా చోప్రా డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు అజయ్‌ భట్ దర్శకత్వంలో 'సెక్షన్‌ 375' అనే సినిమాలో నటిస్తోంది.

Meera Chopra
Star Hotel
Tiffin
Food
Instagram
  • Error fetching data: Network response was not ok

More Telugu News