Cafe Coffee Day: 'కేఫ్ కాఫీ డే' సిద్ధార్థది ఆత్మహత్యేనని తేల్చిన పోస్టుమార్టం రిపోర్ట్!

  • గత నెలలో మరణించిన సిద్ధార్థ
  • నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య
  • ఊపిరితిత్తుల్లో నీరుందని వైద్యుల నివేదిక

గతనెలలో కర్ణాటకలోని నేత్రావతి నదిలో ఆత్మహత్య చేసుకున్న కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణానికి కారణమేంటో పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఆయన నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ సమయంలో ఊపిరాడని పరిస్థితుల్లో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని వైద్యులు రిపోర్టును అందించారు. ఈ రిపోర్టు ఆధారంగా కేసు తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఆత్మహత్యకు ముందు తాను పారిశ్రామికవేత్తగా విఫలమయ్యానని కంపెనీ బోర్డు, ఉద్యోగులను ఉద్దేశించి సిద్ధార్థ లేఖ రాసిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ సంతకంతో ఆయన వ్యక్తిగత లెటర్‌ హెడ్‌ పై ఈ లేఖ రాసినప్పటికీ అది ఆయనే రాశారా? అన్న విషయంపై ఇప్పటికీ అనుమానాలున్నాయి. 

Cafe Coffee Day
Sidhartha
Sucide
Netravati River
Karnataka
  • Loading...

More Telugu News