Narendra Modi: మోదీ వ్యాఖ్యల ఫలితంగా అవినీతి అధికారులపై కొరడా ఝుళిపించిన కేంద్రం

  • పన్నుల విభాగంలో అవినీతిపరులు ఉన్నారంటూ ఎర్రకోట ప్రసంగంలో మోదీ వ్యాఖ్యలు
  • 22 మంది సీనియర్ అధికారులపై కేంద్రం వేటు
  • క్లాజ్ 56 (జే) ఆధారంగా చర్యలు

పన్నుల విభాగంలో కొందరు ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రధాని మోదీ ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవడమే కాదు, వెంటనే రంగంలోకి దిగి 22 మంది అవినీతి అధికారులపై వేటు వేసింది. వారందరూ తక్షణమే తమ విధులకు స్వచ్ఛంద విరమణ ప్రకటించాలంటూ హుకుం జారీ చేసింది. ఉద్వాసనకు గురైన వారిలో నాగ్ పూర్, చెన్నై, మీరట్, చండీగఢ్, కోల్ కతా, ఢిల్లీ, భోపాల్, బెంగళూరు, జైపూర్ జోన్లకు చెందిన సీనియర్ అధికారులున్నారు. మరికొందరు ముంబయి, బెంగళూరు పరిధిలోని కస్టమ్స్ అధికారులు కూడా ఉన్నారు. సీబీఐసీ ఆగ్రహానికి గురైన అధికారులందరూ సూపరింటెండెంట్, ఏవో ర్యాంకు అధికారులే. వీరిందరిపై క్లాజ్ 56(జే) అనుసరించి చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News