Eesha Rebba: బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు హీరోయిన్ల ఎంట్రీ?

  • రసవత్తరంగా సాగుతోన్న 'బిగ్ బాస్ 3'
  • ఇప్పటికే బయటికిపోయిన ఐదుగురు 
  • తెరపైకి శ్రద్ధా దాస్ - ఈషా రెబ్బా  

'స్టార్ మా' చానల్లో 'బిగ్ బాస్ 3' షో రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ కి ఎలిమినేషన్స్ కి మధ్య జరిగే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇప్పటికే షో నుంచి హేమ .. జాఫర్ .. తమన్నా .. రోహిణి .. అషు బయటికి వెళ్లిపోయారు. వీళ్లు వెళ్లిపోవడం వలన షోలో కొంత సందడి తగ్గే అవకాశం ఉందనే భావన ప్రేక్షకుల్లో వుంది.

దీంతో ఈ షోలో మరింత ఉత్సాహాన్ని నింపడం కోసం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇద్దరు హీరోయిన్లను రంగంలోకి దింపే ఆలోచనలో నిర్వాహకులు వున్నట్టుగా సమాచారం. ఒక హీరోయిన్ గా శ్రద్ధా దాస్ .. మరో హీరోయిన్ గా ఈషా రెబ్బా పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ వార్తలో వాస్తవమెంతన్నది చూడాలి. ఒకవేళ నిజమే అయితే, ముందుగా ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారో చూడాలి.

Eesha Rebba
Shraddha Das
  • Loading...

More Telugu News