Yarapathineni: టీడీపీ నేత యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి

  • అక్రమ మైనింగ్ కేసులో యరపతినేనిపై సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్
  • తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిన హైకోర్టు
  • బుధవారంలోగా నిర్ణయం చెప్పాలని ఆదేశం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. వివరాల్లోకి వెళ్తే, అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ యరపతినేనిపై హైకోర్టుకు సీఐడీ నివేదికను సమర్పించింది. ఆంధ్రా బ్యాంకులో అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో, సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. అయితే, సీబీఐ విచారణకు వెళ్లే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. బుధవారంలోగా నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Yarapathineni
CBI
High Court
Telugudesam
  • Loading...

More Telugu News