Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సంక్రాంతి రేసులో మరో సినిమా 
  • శేఖర్ కమ్ముల సినిమా అప్ డేట్ 
  • బల్గేరియాకు రాజమౌళి యూనిట్

*  వచ్చే సంక్రాంతికి ఇప్పటికే పలు పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ జాబితాలో తాజాగా మరో చిత్రం చేరింది. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన 'నిశ్శబ్దం' (సైలెన్స్) సంక్రాంతికి విడుదల కానుంది. వీఎఫ్ఎక్స్ పనులు భారీగా ఉన్నందున ఈ చిత్రం విడుదలను సంక్రాంతికి వాయిదా వేసుకున్నారట.
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ నిన్న మొదలవ్వాలి.  అయితే, సెప్టెంబర్ 5 నుంచి ఈ షెడ్యూలు జరుగుతుందని తాజా సమాచారం. తెలంగాణ పల్లె వాతావరణం నేపథ్యంలో ఇది రూపొందుతుంది.
*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం షూటింగును త్వరలో బల్గేరియాలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు వారాల షూటింగ్ కోసం చిత్రం యూనిట్ త్వరలో అక్కడికి వెళ్లనుంది. ఎన్టీఆర్, చరణ్ ఇందులో హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Anushka Shetty
Shekhar Kammula
Saipallavi
Charan
  • Loading...

More Telugu News