Coffee Day: 'కాఫీ డే' సిద్థార్థ తండ్రి గంగయ్య హెగ్డే మృతి

  • అనారోగ్యంతో కోమాలో ఉన్న గంగయ్య
  • సిద్థార్థ ఆత్మహత్య నాటికే ఆసుపత్రిలో ఉన్న గంగయ్య
  • ఆత్మహత్యకు ముందు తండ్రిని చూసి వెళ్లిన సిద్థార్థ

ఇటీవల 'కాఫీ డే' వ్యవస్థాపకుడు వీజీ సిద్థార్థ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. తాజాగా సిద్థార్థ తండ్రి గంగయ్య హెగ్డే మైసూరులో కన్నుమూశారు. 96 ఏళ్ల గంగయ్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనయుడు వీజీ సిద్థార్థ బలవన్మరణానికి పాల్పడక ముందునుంచే ఆయన కోమాలో ఉన్నారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా గంగయ్యకి తెలియదు. సిద్థార్థ ఆత్మహత్యకు ముందు తండ్రిని చూసి వెళ్లారు. కొన్నిరోజుల వ్యవధిలోనే కుమారుడు, తండ్రి మరణించడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Coffee Day
Sidhartha
Gangaiah Hegde
  • Loading...

More Telugu News