CHINA: హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమం తీవ్రతరం..ఫేస్ రికగ్నిషన్ టవర్లను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులు!

  • ఖైదీల అప్పగింత బిల్లుపై హాంకాంగ్ ప్రజల ఆందోళన
  • తమ హక్కులను చైనా హరిస్తుందని ఆగ్రహం
  • పోలీసుల ప్రధాన ఆయుధాన్ని ధ్వంసం చేస్తున్న ఉద్యమకారులు

చైనా ప్రభుత్వ ఉక్కి పిడికిలికి వ్యతిరేకంగా హాంకాంగ్ ప్రజలు కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్నారు. హాంకాంగ్ లోని ఖైదీలను చైనాకు అప్పగించే కొత్త బిల్లును నిరసిస్తూ వేలాది సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనను తెలియజేస్తున్నారు. ఈ బిల్లుతో తమ హక్కులన్నీ చైనాకు దక్కుతాయనీ, ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తారని హాంకాంగ్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిరసనకారులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు.

హాంకాంగ్ పోలీసుల చేతిలో కీలక ఆయుధంగా మారిన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ(ముఖాన్ని గుర్తించే సాంకేతికత) టవర్లను ధ్వంసం చేయడం ప్రారంభించారు. తమ ముఖాలను పోలీసులు గుర్తించకుండా హాంకాంగ్ వాసులు ఈ చర్యలకు దిగారు. విద్యుత్ కట్టర్ల సాయంతో ఫేస్ రికగ్నిషన్ టవర్లను వీరు ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

  • Loading...

More Telugu News