Jagapati Babu: వామ్మో... ఇది బాహుబలిని మించిపోయింది: జగపతిబాబు

  • ప్రస్తుతం యూఎస్ పర్యటనలో జగపతి బాబు
  • అయోవా రాష్ట్ర ప్రదర్శనకు హాజరు
  • రెండు టన్నుల ఎద్దును చూసి ఆశ్చర్యం

జగపతిబాబు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దాన్ని బాహుబలి దున్నపోతుగా పోల్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే, ప్రస్తుతం అమెరికాలోని అయోవా పర్యటనలో ఉన్న జగ్గూ భాయ్, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఓ ప్రదర్శనకు హాజరయ్యాడు. అక్కడ, తనకు ఓ అద్భుతం ఎదురైందని, అబ్బురపోయానని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.

'బాహుబలి' సినిమాలో భల్లాలదేవుడు ఓ దున్నపోతుతో పోరాడతాడు కదా?... తన ముష్టి ఘాతాలతో దాన్ని మట్టికరిపిస్తాడు కూడా. అంతకు మించి, దాదాపు రెండు టన్నుల బరువున్న ఎద్దు, జగపతిబాబు కంటపడింది. ప్రపంచంలోనే భారీ కాయం కలిగిన ఎద్దుల్లో ఇదొకటి. ఇక దీన్ని చూసిన జగ్గూ, తాను షాకైయ్యానంటూ ట్విట్టర్ ద్వారా తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ఈ నెల 13 నుంచి 23 వరకు అయోవాలో ఈ ప్రదర్శన జరుగగా, దాదాపు పది లక్షల మంది సందర్శించినట్టు అంచనా.

Jagapati Babu
USA
Ayova
  • Error fetching data: Network response was not ok

More Telugu News