Mahabubabad District: ఒకే కుటుంబంలోని ముగ్గురిని కాటేసిన కట్లపాము!

  • మహబూబాబాద్ జిల్లాలో ఘటన
  • పాము కాటుతో మరణించిన రవి
  • చావు బతుకుల మధ్య రవి భార్య, కుమారుడు

గాఢ నిద్రలో ఉన్న ఓ కుటుంబంపై పాము విషం చిమ్మింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండలం ఎరచెక్రు తండాలో జరిగింది. జాతోట్ రవి (38), తన భార్య, కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న వేళ, సుమారు 5 అడుగుల పొడవున్న కట్లపాము ముగ్గురినీ కాటేసింది. మనకు తరచూ కనిపించే అత్యంత విషపూరితమైన పాముల్లో కట్లపాము కూడా ఒకటన్న సంగతి తెలిసిందే.

పాము విష ప్రభావంతో జాతోట్‌ రవి అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. వారికి మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. వీరిని కాటేసిన పాము అత్యంత విషపూరితమైందని స్నేక్‌ క్యాచర్లు అంటుండటం గమనార్హం.

Mahabubabad District
Snake
Bite
Died
  • Loading...

More Telugu News