kodela sivaprasad: ప్రభుత్వం ఒత్తిడి వల్లే కోడెల ఆసుపత్రి పాలయ్యారు: టీడీపీ నేత నక్కా ఆనందబాబు

  • గత రాత్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మాజీ సభాపతి
  • కోడెలను పరామర్శించిన టీడీపీ నేత
  • జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపణ

అక్రమ కేసులతో వేధిస్తుండడం వల్లే ఏపీ అసెంబ్లీ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్‌ ఆసుపత్రి పాలయ్యారని టీడీపీ సీనియర్‌ నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు. గుండెపోటు రావడంతో నిన్నరాత్రి తన కుమార్తె ఆసుపత్రిలో కోడెల చేరిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం కోడెలను పరామర్శించిన ఆనందబాబు వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు అధికం కావడం వల్లే కోడెల శివప్రసాదరావు ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆరోపించారు. ఆయన వెంట పార్టీ నాయకుడు జి.వి.ఆంజనేయులు ఉన్నారు.

kodela sivaprasad
nakka anandababu
hospitalised
govt.pressure
  • Loading...

More Telugu News