Jairam Ramesh: మోదీపై జైరాం రమేశ్ వ్యాఖ్యలను సమర్థించిన శశి థరూర్

  • మోదీ చేసిన మంచి పనులను మెచ్చుకోవాలి
  • అప్పుడే విపక్షాల పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది
  • గత ఆరేళ్ల నుంచి నేను ఇదే చెబుతున్నా

ప్రధాని మోదీని దోషిగా చూపించాలనుకునే ప్రయత్నాలు చేయవద్దని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోదీ చేసిన మంచి పనుల గురించి కూడా మాట్లాడాలని... ఏక పక్షంగా విమర్శిస్తూ పోతే అది మోదీకే లాభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలను మరో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి కూడా సమర్థించారు.

ఈ క్రమంలో తాజాగా, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కూడా ఈ జాబితాలో చేరారు. మోదీ చేసిన మంచి పనులను మెచ్చుకోవాలని... అప్పుడే విపక్షాల పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందని శశిథరూర్ అన్నారు. ఇదే విషయాన్ని తాను ఆరేళ్లుగా చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. మోదీ చేసిన మంచి పనులను మెచ్చుకున్నప్పుడే... అయన ఏదైనా తప్పు చేసినప్పుడు మనం చేసే విమర్శలకు విశ్వసనీయత ఉంటుందని తెలిపారు.

Jairam Ramesh
Abhishek Manu Singhvi
Shashi Tharoor
Modi
BJP
Congress
  • Loading...

More Telugu News